Wednesday, November 20, 2024

నేత్రదానంతో ఇద్దరికి కంటివెలుగు

తానుమరణించి మరొకరికి కంటి వెలుగును ప్రసాదించిన మాతృమూర్తి గర్నేపల్లి ఝాన్సీ లక్ష్మీబాయి అని అవయవ దాన కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. వివరాల్లోకెళ్తే… కరీమాబాద్ ప‌రిధిలోని పోచం మైదానంకు చెందిన గర్నేపల్లి ఝాన్సీ లక్ష్మీబాయి (68) అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుమారులు వరంగల్ నగరంలోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు వారి తల్లి నేత్రాలను దానం చేశారు.

దీంతో ఇద్దరికీ కంటి వెలుగును ప్రసాదించి తను దివికేగినా భూలోకంలో తన కళ్ళతో లోకాన్ని చూస్తూనే ఉందన్నారు. మనం కలకాలం భూలోకం పై నిలిచి పోవాలంటే అవయ‌వ‌దానం చేసినట్లయితే చిరస్మరణీయం అవుతామని అవయవ కమిటీ సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. మృతురాలి కుమారులు ప్రదీప్, ప్రమోద్ కూతుర్లు శ్రీలత, హేమలత తమ తల్లి నేత్రాలను దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, అవయవ దానం కమిటీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement