Saturday, November 2, 2024

అకాల వర్షం.. అపార నష్టం..

గూడూరు, (ప్రభ న్యూస్) : మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో 39 గ్రామాలలో, రైతులు వేసిన పంటలు మిర్చి మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతు వేదిక పైక‌ప్పు రేకులు ఊడి ప‌డ్డాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కేంద్రం రేకులు గాలివానకు లేచిపోయి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి దాని ప్ర‌భావంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

ఇదిఒ కూడా చ‌ద‌వండి : Breaking: సింగరేణిలో కరోనా కలకలం.. 9 మంది కార్మికులకు పాజిటివ్

ఓ వైపు మిర్చి పంటకు వైరస్ సోకి లక్షలు పెట్టుబడి పోయి నష్టపోయామని రైతులు లబోదిబో అంటుంటే ఇదే క్రమంలో వర్షాలు పడి ఉన్న పంట కూడా నష్టపోవడం జరిగిందని ఇక చావే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నష్టపోయి ఇల్లు కూలిపోయి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు, లంబాడి ఐక్యవేదిక నాయకులు వాంకుడోత్ గోపీనాథ్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement