ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల గడువును పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలతో.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు బోర్డు ప్రకటించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తరగతి గ్రేడ్, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇంటర్ అడ్మిషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని…. ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన కాలేజీల్లోనే చేరాలని చెప్పారు విద్యార్థులకు సూచించింది.