హైదరాబాద్, ఆంధ్రప్రభ: పోలీస్ రిక్రూట్మెంట్కు సబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతల్లో 3 సంవత్సరాల సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది పోలీస్ నియామక పరీక్షకు అర్హులు కానున్నారు.
ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షలకు ఉచిత కోచింగ్‌ను తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ అందిస్తోంది. ప్రభుత్వం 3 ఏళ్ల సడలింపు ఇవ్వడంతో ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 18 వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..