ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన లగచర్ల ఘటన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను కోర్టు పొడిగించింది. నిన్నటితో పట్నం నరేందర్ రిమాండ్ గడువు ముగియగా.. పోలీసులు కొడంగల్ కోర్టు లో హాజరు పరిచారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను డిసెంబర్ 11 వరకూ పొడిగిస్తూ జూనియర్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారుల దాడి కేసులో ప్రధాన నిందితుడు
వికారాబాద్ జిల్లా లగచర్లలో భూ సేకరణపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు.