భారీ పేలుడు సంభవించిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ ఆవరణలో చెత్తను తగులబెడుతుండగా ఆకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జీఎంఆర్ సంస్థకు చెందిన పారిశుధ్య కార్మికురాలు శాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్టేషన్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఖాళీ సీసాలో గ్యాస్ పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.