కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ భగత్ సింగ్ నగర్ లో ఎలాట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలింది. ఈ ఘటనతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. చార్జింగ్ పెట్టి ఉండగానే బ్యాటరీ పేలినట్టు బాధితులు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ భగత్ సింగ్ నగర్ కు చెందిన సాయికుమార్ రెడ్డి అనే వ్యక్తి సేల్స్ మార్కెటింగ్ చేస్తుంటాడు. మార్కెటింగ్ కు పెట్రోల్ అధికంగా ఖర్చు అవుతుందని ఛార్జింగ్ స్కూటీ (hala hyd, HR -35) ప్రతి రోజు RS. 150 చొప్పున రెంట్ చెల్లిస్తూ నడుపుకుంటున్నాడు. పొద్దంతా మార్కెటింగ్ చేసుకొని వచ్చి రాత్రి పడుకునే సమయంలో పక్కనే బ్యాటరీ కి ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. మంగళవారం రాత్రి 3 గంటల సమయంలో కాలిన స్మెల్ వస్తుండగా లేచి చూడగా బ్యాటరీ లోనుంచి పొగలు వస్తున్నవి.
లేచి పక్కనే మరో రూమ్ లో ఉన్న స్విచ్ ఆఫ్ చేసే లోపే బ్యాటరీ పేలిపోయింది. ఇంటినిండా మంటలు ఎగిసి పడ్డాయి. పొగలు ఇంటినిండా కమ్ముకున్నాయి. తేరుకునే లోపే ఇంట్లోని బట్టలు, మంచం, సెల్ ఫొన్, తదితర సామగ్రి పూర్తిగా కాళీ బుడిదయ్యాయి. స్థానికులు గమనించి కిటికీలు, వెంటిలేటర్ నుంచి నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. సంఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మంటలు ఆర్పడంలో సహకరించారు. బ్యాటరీ పేలిన సమయంలో ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.