అమీర్‌పేట్ ఇంటర్ చేంజ్ మాల్లో కొనుగోలు
బిల్‌తోపాటు ట్విట్టర్లో పోస్టు
సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్న జీహెచ్ఎంసీ
ఆహార భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బిజీగా ఉండే ఇంటర్చేంజ్ స్టేషన్ అది. అమీర్‌పేట మెట్రో స్టేషన్ అంటే అతి పెద్ద జంక్షన్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే రెండ్, బ్లూ లైన్స్ మెట్రోలో ప్రయాణించేవారు అక్కడే మారుతుంటారు. రాకపోకలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. అయితే.. ఇక్కడ ఉన్న మాల్స్, షాపింగ్ ఏరియాలపై అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని చాలామంది ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి ఈ మధ్య జరిగిన ఓ ఇన్సిడెంట్‌ని ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు..
రాబిన్ అనే ప్రయాణికుడు అమీర్‌పేట్ మెట్రో ఇంటర్ చేంజ్‌లో ఉన్న రత్నదీప్ స్టోర్ నుంచి ఒక డెయిరీ మిల్స్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్ చేస్తే పురుగులు కనిపించాయి. దీంతో అతను దాన్ని వీడియో, ఫొటోలు తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా.. ట్విట్టర్లో తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశాడు. ఇప్పుడిది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. హైదరాబాద్‌లోని మెట్రో ఇంటర్చేంజ్ స్టేషన్ అమీర్‌పేట్‌లోని రత్నదీప్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్ బిల్లు ఫొటోను కూడా షేర్ చేశాడు. దీనిపై రిప్లయ్ కోసం GHMCని ట్యాగ్ చేశాడు. అతని ఫిర్యాదుతో GHMC తక్షణమే గుర్తించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆహార భద్రతా బృందాన్ని ఆదేశించింది.
నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్..
ఈ వీడియో, ఫొటోలను చూసిన చాలామంది ట్విట్టర్ (ఎక్స్) నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు. మెట్రో స్టేషన్స్, మాల్స్, ఎయిర్పోర్ట్ మాల్స్‌లోనూ తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.