Friday, November 29, 2024

TG | ప్ర‌భుత్వ హాస్పిట‌ల్లో ఎక్స్ పైర్ ఇంజ‌క్ష‌న్ లు.. మండిప‌డ్డ ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్య

ఆలేరు – ప్రభుత్వ ఆస్పత్రిలో గడువు ముగిసిన ఇంజెక్షన్స్ దర్శనం ఇవ్వడంపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీరియస్ అయ్యారు. నేటి ఉద‌యం ఆయ‌న స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఇంజక్షన్‌ బాక్స్‌లో గడువు తేదీ ముగిసిన ఇంజెక్షన్స్‌ ఉండటాన్ని గుర్తించి వైద్యుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వెంట‌నే త‌ప్ప‌లు స‌రిదిద్దుకోవాల‌ని వైద్యుల‌ను కోరారు.

అనంత‌రం ఆయ‌న ప్రభుత్వ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్థానిక జ్యోతిరావు ఫూలే వసతి గృహన్ని తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవలే డైట్ చార్జీలు పెంచిందని, నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురద చల్లడం మానుకోవాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement