Friday, January 31, 2025

Experium Eco Park – బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ … చిరంజీవి

చిలుకూరు – ఎక్స్‌పీరియం పార్క్‌ అనేది బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అని, ఈ పార్క్ అధ్భుతమైన ల్యాండ్ మార్క్ అవుతుందన్నారు మెగా స్టార్ చిరంజీవి. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చే పార్క్ ఇదని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్లెండ్లీ ఎక్స్ పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో క‌లసి చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ, ఎప్పుడో విదేశాలకు వెళ్లినప్పుడు రకరకాల మొక్కలు, అద్భుతమైన జీవం ఉట్టిపడే శిల్పాలు చూస్తుంటే అది మనతో ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది.. అని అనుకునే వాడిని అంటూ గుర్తుచేశారు. అలాంటిది ఇక్కడ హైదరాబాద్‌ పరిధిలో లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

విభిన్నమైన మొక్కలు, అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయని తెలిపారు. ఈ పార్కు ఏర్పాటు చేసిన రామ్‌దేవ్ ఒక వ్యాపార వేత్త కాదని, ఒక కళాకారుడని కొనియాడారు. 25 ఏళ్ల పాటు రామ్‌దేవ్ ఇలాంటి వాటిపై ఎన్నో పరిశోధనలు చేశారని, ఎక్కడెక్కడ ఎలాంటి మొక్కలు దొరుకుతాయి. శిలలు దొరుకుతాయి.. వాటికి ఇక్కడికి ఎలా తీసుకొని రావాలి.. వాటిపై రీసెర్చ్ చేశారని వివరించారు.

ఇలాంటివి మన స్టేట్, హైదరాబాద్‌కి అందం తీసుకొచ్చేవని, దేశంలోనే చెప్పుకునే గొప్ప పార్కు అవుతుందని రామ్‌దేవ్ పడ్డ కష్టం, నేడు అధ్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారని హర్షం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలం సినిమా షూటింగ్‌లకు ఇస్తారా? అని నేను రామ్ దేవ్‌ను అడిగాను.. తన సినిమా షూటింగ్ మాత్రమే ఫస్ట్ ఇక్కడ తీయాలని రామ్‌దేవ్ చెప్పినట్లు చిరంజీవి నవ్వులు పూయించారు.

- Advertisement -

రేవంత్ ప్రొత్స‌హించ‌డం అభినంద‌నీయం..

ఇక ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ఎంత బిజీగా ఉన్న ఈ పార్కు ఓపెనింగ్‌కు రావడం చాలా సంతోషమని ప్ర‌శంసించారు రేవంత్. ఇలాంటి పార్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం అందించడం చాలా అభినందనీయం అని తెలిపారు. ఈ పార్క్‌ల వల్ల ఎంతో మందికి ఉపాధి, టూరిజం పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం సహకారం ఈ పార్కుకు మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement