Friday, November 22, 2024

Exclusive – ఆ రెండు పులుల ఎక్కడ?

ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్: అడవికి రారాజు… తిరుగులేని అటవీ సామ్రాజ్యంలో ఆధిపత్యంతో శాసించే పెద్దపులికి ఊహించని ఆపద వచ్చి పడింది. జీవ వైవిధ్యం లేక.. ఆవాసం దొరక్క.. విష ఆహారం ఉచ్చులో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఒక ఆడ పులి మరో మగ పులి వరుసగా మృతి చెందిన సంఘటన అటవీ శాఖలో కలకలం రేపుతోంది. అయితే ఇంతకాలం పులుల కదలికలను పసి కట్టకపోవడం, ఆహారం దొరక్క పశువులను చంపితినడo, ఆధిపత్యం కోసం మగ పులులు ఘర్షణ పడుతుండడం అడవుల్లో నిత్య కృత్యంగా మారాయి. వరుస పులుల మరణాలు అటవీ అధికారుల నిర్లక్ష్యాన్ని అడుగు అడుగడుగున ఎత్తిచూపుతున్నాయి. పురుగు మహారాష్ట్రలోని ప్రణహిత, పెన్ గంగ, గా ఇంద్రావతి పరివాహక నదుల తీరం గుండా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రతి ఏటా నవంబర్ మాసం నుండి పెద్ద పులులు రాకపోకలు సాగిస్తుంటాయి

. ఒక్క కాగజ్ నగర్ డివిజన్ లోనే 8 వరకు పెద్ద పులులు ఉంటాయని అంచనా. ఒక మగపులి, ఆడ పులి జతకట్టి నాలుగు పిల్లల సంతతితో ఆవాసం ఏర్పరచుకోగా , ఈనెల 6న దరిగాం అటవీ ప్రాంతంలో ఆడ పులి పిల్ల, పక్కనే ఒక పశువు కాలేబరం మృత్యువాత పడిన సంఘటన అలజడి రేపింది. తమ పశువులు పెద్దపులుల దాడిలో చనిపోతున్నాయని ఆందోళన చెంది రైతులు స్మగ్లర్లు పశువుల కళేబరం పై విషం చల్లి పెద్ద పులులు ఆహారంగా భుజించినప్పుడు అవి చనిపోతున్నట్టు తెలుస్తోంది. సోమవారం మృతి చెందిన పెద్దపులి ఆరేండ్ల వయస్సు ఉన్నట్టు పిసిసిఎఫ్, వన్యప్రాణి, ఎన్ సి టి ఏ అధికారులు గుర్తించారు.

పంచ నామాలో పశువు కళేబరం పై విషం చల్లి ఉన్నట్టు కూడా వాసనతో పసిగట్టారు. పులు ల కదలికలపై అటవీ అధికారులు స్పందించకపోవడం పై ఎన్ సి టి ఏ అధికారులు సీరియస్ గా స్పందించి క్రమశిక్షణ చర్యల కింద వేటు వేసినట్టు తెలుస్తోంది. పైగా మగ పులి వెంట సంచరించే ఆడ పులి తో పాటు రెండేళ్ల చిన్న పులి కూడా విష ఆహారం తిని ఎక్కడో చనిపోయి ఉండవచ్చని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం తల్లి పులి పిల్ల పులి కోసం ట్రాకర్ల సహాయంతో పురుగు మహారాష్ట్ర వరకు జల్లెడ పడుతూనే ఉన్నారు. పెద్దపుల సంతతి పెరుగుతుండడం, మరోవైపు అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడం, వారానికి ఒక పశువును పెద్దపులి తింటున్నట్టు నిర్ధారణకు వచ్చిన నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ అధికారులు పెద్ద పులుల కారిడారు పై దృష్టి సారిస్తున్నారు. తడోబా తిప్పేశ్వర్ అటవీ పులుల సంరక్షణ కేంద్రం నుండి ఆదిలాబాద్ జిల్లా వైపు పులులు వలస వస్తున్నాయని ఇందుకోసం అవరోధాలు లేకుండా కారిడార్ను పటిష్టంగా ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement