Saturday, November 2, 2024

Exclusive … నిశ్శ‌బ్ద హోరీష్..

ఆరడుగుల బుల్లెట్టు… ప్రత్యర్ధులకు అందని రాకెట్టు… రాజకీయాల్లో స్ట్రాటజిస్టు… వ్యూహరచనలో లేటెస్టు… హరీష్‌రావు! ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేశారు. ఉద్యమ కాలం నుంచీ ఆయన స్టయిలే వేరు. యువతను ఆకర్షించడంలో, గ్రామీణులకు నచ్చజెప్పడంలో, వృద్ధులను ఆదరించడంలో, కళాకారులను ఉత్తేజపరచడంలో ఆయనకాయనే సాటి. సమస్య ఎంత పెద్దదైనా అవగాహనతో శోధించి, విశ్లేషించి, విడమరచి, వివరించి, పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. అది సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య కావచ్చు… అంతిమంగా సమసిపోవాల్సిందే… అందరితో ఔననిపించాల్సిందే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒక వ్యక్తి జీవితంలో పధ్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలోను, మరో పదేళ్లు అధికారంలోను కొనసాగి సామాజికవేత్త లతో పాటు రాజకీయ పండితుల ప్రశంసలు అందుకో వడం అంత తేలిక కాదు. కాని, చిత్తశుద్ధితో, నిస్వార్ధ సేవతో, జనహితమే సమాజహితంగా భావిస్తూ అచంచల విశ్వాసంతో, అధినేత ఆదేశాలను ఔదల దాల్చి ముందుకు సాగడమే విజయంగా నమ్మిన అజాతశత్రువు హరీష్‌రావు. పామరుల్లో పామరుడి గా, పండితుల్లో పండితునిగా కలిసిపోయి వారితో వారి పారిభాషిక పదాలతోనే మాట్లాడుతూ, తమ ఇంటివాడే తమతో మంచీ చెడూ వివరిస్తున్నట్టుగా మెలగడం ఆయనకే సాధ్యం. ఉద్యమకాలంలో పడిన కష్టాలు, ఉమ్మడి పాలకుల కాలంలో అనుభ వించిన ఇబ్బందులను కళ్లకు కట్టినట్టుగా చెబుతూ గత స్మృతులను నెమరువేసి నాటి కాలం జనాన్ని కన్నీటిపర్యంతం చేస్తారు… ఆ తర్వాత కేసీఆర్‌ పాలన లో ఏవి
కలిగిస్తారు… ఆపై వచ్చే అయిదేళ్లకు ఏవిధంగా మేనిఫెస్టోలో ప్రణాళికలు రూపొందించిందీ చెప్పి భరోసాను కల్పిస్తారు… ఇన్ని అంశాలను ఎంతో చక్కగా, చాకచక్యంగా, హృద్యంగా, మనోజ్ఞంగా వివరించగలగడం అనితర సాధ్యం. ఆయన నోరు విప్పితే చాలు నిండు సభలో నిశ్శబ్దమే… ఆయన చెప్పే ప్రతి మాట ఆయా వర్గాలను సూటిగా తాకుతుంది. మనస్సులో సంకోచాలను పటాపంచలు చేస్తుంది… చివరగా జై కొట్టిస్తుంది!

ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని, ఏయే పథకాలను ఏవిధంగా, ఎవరెవరికి, ఎలా, ఎప్పుడు ఉపయోగపడుతున్నాయో సుదీర్ఘంగా చెబుతారు. అవ్వ, తాతలకు పింఛను నుంచి మనుమడి చదువు వరకూ కేసీఆర్‌ ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటోందో ఉదాహరణలతో సహా వివరిస్తూ, ఇంతకు మించి ఏ ఇంటి పెద్ద అయినా ఇంకేమీ చేయగలరని గడుసుగా ఎదరు ప్రశ్నిస్తారు… మరింకేం కావాలో చెబితే కచ్చితంగా చేయగలమని కూడా వెన్నంటి నిలిచి ధైర్యం చెబుతారు… దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ లేని పథకాలను ఒక్కొక్కటి చెబుతూ, ఎక్కడో ఎవరికో ఏదో స్కీము అందకపోతే అసంతృప్తి సహజమే కాని, ఇంటి పెద్దపై అలిగి ఇల్లు తగులబెట్టుకోలేం కదా అని అనునయిస్తారు…

అధినేతకు నమ్మిన బంటుగా, పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా, శ్రేణులకు భరోసాగా, ఆయా సామాజిక వర్గాలకు అండగా, ప్రత్యేకించి ఉద్యమకారులకు సహాధ్యాయునిగా, అందరికీ తలలో నాలుకలా మెలగుతున్న హరీష్‌ ఎన్నికల వేళ… ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక బాధ్యతలనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా పర్యటిస్తూ, అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలుకరిస్తూ, ప్రచారంలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏమూల ఏమాత్రం చిన్న అసంతృప్తి కనిపించిన వెంటనే స్పందించి సరిచేస్తున్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో సవ్యచాచిలా విమర్శనాస్త్రాలను సంధిస్తూ ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. హరీషన్న జనం ఆస్తి, హరీషన్న భారాస కీర్తి, హరీషన్న యువతకు దోస్తీ, హరీషన్న సమాజానికే స్ఫూర్తి… ఇదీ జనం హితోక్తి!

Advertisement

తాజా వార్తలు

Advertisement