Monday, November 18, 2024

Exclusive – కోమటిరెడ్డి రాజగోపాల్‌ ది అ’రాజ‌’కీయం…….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చివరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కోవర్ట్‌ ఆపరేషన్‌ బట్టబయ లైంది. ”హస్త వికాస కుట్ర” శీర్షికతో ఆంధ్రప్రభ బుధవారం సంచికలో ప్రచురించిన కథనం పెను ప్రకంపనలను సృష్టించింది. హస్తినలో కమలదళం తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపో యింది. ఈ స్థాయిలో ద్రోహానికి పాల్పడిన రాజ గోపాల్‌రెడ్డిని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని అగ్రనేతలు అంటున్నారు. నమ్మించి గొంతు కోసిన రాజగోపాల్‌పై శ్రేణులు మండిపడితున్నా యి. ఇదిలాఉండగా, రాజగోపాల్‌ను చేర్చుకునే అంశంలో పార్టీ తమ సిఫారసులను పట్టించు కోలేదని ఇప్పుడు సంఘ్‌పరివార్‌ కూడా శ్రేణు లతో గొంతు కలుపుతోంది. దుబ్బాక, హుజూరా బాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించి భారాసతో నువ్వా? నేనా? అన్నట్టు తీవ్ర స్థాయిలో పోటీ ఇస్తున్న భాజపాను దెబ్బ తీయాలన్న కుట్ర కోణం కాంగ్రెస్‌దేనని భాజపా అధిష్టానానికి ఇప్పుడు స్పష్టమైంది. ముందస్తు ప్రణాళికతోనే రాజగోపాల్‌రెడ్డిని కోవర్ట్‌గా కమల దళంలోకి పంపించారని హస్తిన నేతలు భావిస్తు న్నారు. కావాలనే కాంగ్రెస్‌ నేతలపై దండెత్తి తీవ్ర ఆరోపణలతో తమ వద్దకు చేరాడని, సంఘ్‌ పరివార్‌ అనుమానించినా మునుగోడులో రాజీనామా చేసి మళ్లి పోటీ చేయడానికి సిద్ధపడి అందర్నీ నమ్మించారని వారు విశ్వసిస్తున్నారు.

దుబ్బాక, హుజూరాబాద్‌లో అయిదు వేల కంటే తక్కువ ఓట్లు సంపాదించిన కాంగ్రెస్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చావుదెబ్బ తినడంతో ఈ కోవర్ట్‌ ఆపరేషన్‌కు తెరలేపిందని స్పష్టమవుతోందని భాజపాతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా నమ్ముతున్నారు. మునుగోడులో కూడా కాంగ్రెస్‌కు 25 వేల ఓట్లు వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌, రాజగోపాల్‌ కుమ్మక్కు కావడం వల్లే ఇక్కడ ఓట్లు వందల నుంచి వేలకు పెరిగాయని వారు విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లలో వలె అయిదు వేల ఓట్లు పడి ఉంటే కచ్చితంగా భాజపా విజయం సాధించి ఉండేదని అంటున్నారు. అయితే, భాజపాను ఇక్కడ ఓడించాలనే లక్ష్యంతో వారు పన్నిన వ్యూహం ఫలించిందని తేటతెల్లమవుతోందని చెబుతున్నారు. మునుగోడులో భాజపాను ఓడించడం ద్వారా కమల విజయాలు గాలిపాటువేనని జనంలోకి తీసుకెళ్లడమే కాంగ్రెస్‌ వ్యూహమని, కోవర్ట్‌ ఆపరేషన్‌ ద్వారా దాన్ని సాధించారని భాజపా అగ్రనేత అమిత్‌షా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
భాజపాలో కోవర్ట్‌గా చేరడమే కాకుండా హస్తిన నాయకులను మెప్పించి జార్కండ్‌లో అతి భారీ కాంట్రాక్ట్‌ను పొందడాన్ని శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. చంద్రగుప్త మైన్స్‌ పేరుతో 18 వేల కోట్ల రూపాయిల విలువైన గనులను రాజగోపాల్‌ సొంతం చేసుకున్నారని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక పక్క కాంగ్రెస్‌కు లాభం చేకూర్చేందుకు రకరకాల విన్యాసాలు చేస్తూనే మరోపక్క సొంత ప్రయోజనాలను చక్కబెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వకార్యం, స్వామికార్యాన్ని ఏకకాలంలో తీర్చుకున్న రాజగోపాల్‌ను తేలిగ్గా ఎలా వదిలేస్తారని, ఆయన సంస్థల అక్రమ కార్యకలాపాలపై కన్నేయాల్సిందేనని భాజపా శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.
కోవర్ట్‌ ఆపరేషన్‌ పూర్తయ్యాక వారు అనుకున్నట్టుగానే కాంగ్రెస్‌ తిరిగి ఊపిరి పోసుకుంది. రాజగోపాల్‌ రెడ్డి అప్పటి నుంచి భాజపాకు దూరమవుతూ వచ్చారు. వ్యూహంలో భాగంగానే సరైన సమయంలో ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతుండడం దీన్ని మరింత ధ్రుపరుస్తోంది. ఎన్నో యుద్ధాలలో ఆరితేరిన భాజపా అగ్రనేతలను ఈవిధంగా దెబ్బతీయడం రాజకీయ వర్గాలలో ప్రకంపనలు లేపుతోంది. ఇది ఇక్కడితే ఆగదని, ముందు ముందు మరింత తీవ్ర స్థాయిలో భాజపా దెబ్బకొట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement