Monday, June 24, 2024

Exclusive – తోకపిట్ట‌ల మురిపెం! క‌నువిందు చేస్తున్న వ‌ల‌స ప‌క్షులు


ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్: పచ్చని తివాచీ పరిచినట్టు చెట్లు… సెలయేటి గ‌ల‌గ‌ల‌లు.. ప‌క్షుల కేరింత‌లు.. ప్ర‌కృతి ప్రేమికుల‌ను ఎంతగానో ఆక‌ర్షించే ఆదిలాబాద్, త‌డోబా అట‌వీ ప్రాంతం వ‌ల‌స ప‌క్షుల‌కు నెల‌వుగా మారింది. వీటికి తోడు చూడముచ్చట రంగురంగుల మేళవింపులు.. విన సొంపైన కిలకిలలు.. చిత్ర విచిత్రమైన ఆకృతులు.. బిత్తర చూపులు.. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ వ‌ల‌స ప‌క్షులు చేసే విన్యాసాలు ప్ర‌తి ఒక్క‌రినీ ఇట్టే క‌ట్టిప‌డేస్తున్నాయి.

వ‌ల‌స ప‌క్షుల‌ సంద‌డి

- Advertisement -

ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్న తిప్పేశ్వర్, తడోబా, జన్నారం అభయారణ్యాల్లో విదేశీ, స్వ‌దేశీ వలస పక్షులు చేసే సందడి చూప‌రుల‌ను ఆకట్టుకుంటుంది. మే చివారి వారంలో చెట్లు చిగురుస్తున్న దశలోనే సుదూర ప్రాంతాల ఈ ప‌క్షులు వ‌స్తాయి. ఈ ఏడాది ప‌శ్చిమ దిశ నుంచి వ‌చ్చే పొన్నంకి పిట్టలు (న‌వ‌రంగి బ‌ర్డ్స్ ) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

కోసాయిలో పొన్నంకి పిట్టల సంద‌డి

ఆదిలాబాద్ – మహారాష్ట్ర సరిహద్దులోని దట్టమైన అట‌వీ ప్రాంతంలో ఉన్న గ్రామం కోసాయి. ఇక్క‌డ‌కు రంగురంగుల పొన్నంకి పిట్టలు (న‌వ‌రంగి బ‌ర్డ్స్) వ‌ల‌స వ‌చ్చాయి. ప‌చ్చ‌ని చెట్ల‌పై రంగురంగుల పొన్నంకి పిట్ట ప‌ర్యాట‌కుల‌ను ఇట్టే క‌ట్టి ప‌డేస్తున్నాయి. చెట్ల‌పై రంగురంగులుగా ఉండే ఈ ప‌క్షులు వాలితే క‌నువిందుగా ఉన్నాయ‌ని గ్రామ‌స్థులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌శ్చిమ దిశ‌ నుంచి రాక‌…

ఆదిలాబాద్ అడ‌వుల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటున్న పొన్నంకి పిట్ట‌లు మ‌న దేశంలోని ప‌శ్చిమ దిశ నుంచి ఇక్క‌డ‌కు వ‌స్తున్నాయి. ఇక్క‌డ ఉన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు ఆక‌ర్షించి ఇక్క‌డ‌కు వ‌స్తున్నాయ‌ని శాస్త్ర‌వేత్తలు చెబుతున్నారు. బ‌ర్డ్ శాస్త్రీయ నామంతో పిల‌వ‌బ‌డే పొన్నంకి పిట్ట‌గా నామ‌క‌ర‌ణం చేశారు. మేలో వ‌చ్చే ప‌క్షులు జూన్ వ‌ర‌కు ఉంటాయి. ప్ర‌తి రోజూ సూర్యోద‌యం, సూర్య అస్త‌మ‌యం వేళల్లో మాత్రమే తీయని రాగాల‌తో సందడి చేస్తున్నాయి.

తొమ్మిది రంగుల..

తొమ్మిది రంగులతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉండే పొన్నంకి పిట్ట‌ పొడవాటి ముక్కుతో రాలిన ఆకుల కింది భాగంలో కీటకాలను తింటూ జీవనం సాగిస్తాయి. ఆడ జాతి పొన్నంకిని ఆకట్టుకునేందుకే అరుదుగా ఈ పక్షి కూతలు పెడుతుందని ప‌క్షుల‌పై అధ్యయనం చేస్తున్న ఎల్ .కృష్ణ తెలిపారు. తొమ్మిది రంగుల ఆకృతితో ఉండడం వల్లే దీనికి నవరంగి బ‌ర్డ్‌ అని పిలుస్తార‌ని తెలిపారు.

ఇవి కాకుండా…

విభిన్న వాతావరణ పరిస్థితులకు అలవాలమైన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఖండంతరాలు దాటి వలస పక్షులు వచ్చి వెళుతున్నాయి. నార్త్ అమెరికా నుంచి టెల్​డ్ స్వాలోస్.. ఆస్ట్రేలియా నుంచి కొంగజాతిని పోలి ఉండే “పెంటెడ్ స్టార్క్​.. బెజ్జూర్ ,పెంచికల్పేట్, కౌటాల ప్రాంతం ప్రాణ‌హిత‌ తీరంలో అముర్ పాల్కన్ జాతి అరుదైన వలస పక్షులు సందడి చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement