Monday, November 25, 2024

Exclusive – గులాబీ తోట‌లో క‌లుపు అంట్లు ….

అధికారమే వారి ధ్యాస
స్వార్ధ రాజకీయమే శ్వాస
కేడర్‌ పట్టదు… సమస్యలు గిట్టవు
చెక్కభజనలో నిపుణులు
శ్రీ హడావుడిలో నిష్ణాతులు
ఇన్నాళ్లూ ముఖం చాటేసిన కొందరు నేతలు
అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు
పదవులతో దిలాసా.. కులాసా
కార్యకర్తలను, పార్టీని పట్టించుకోని వైనం
తాజాగా కారు జోరు.. శ్రోణుల్లో జోష్‌
హైడ్రా, ఆపరేషన్‌ మూసీపై విమర్శలు
బాధితులకు అండగా కేటీఆర్‌, హరీష్‌
కష్టజీవులకోసం ఆరాటం…
కలసికట్టుగా పోరాటం
క్రియాశీలకంగా భారాస
ఇప్పుడు సానుకూల పరిస్థితులు
మళ్లీ పార్టీ వేదికలపై కొందరు మాజీలు ప్రత్యక్షం
పార్టీని దెబ్బతీసింది ఇలాంటివారే
వారిని దూరంగా ఉంచాలంటున్న ద్వితీయశ్రేణి నేతలు

ఉద్యమ బాట వదిలి… అధికార వ్యామోహంతో కొందరు భారాస మాజీ నేతల వ్యవహరిస్తున్న తీరును శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఎప్పుడో రానున్న అసెంబ్లి ఎన్నికలు ఇప్పుడే వచ్చేస్తున్నట్టు హడావుడి చేస్తూ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ నేతలు పార్టీని ఏనాడు పట్టించుకోలేదని వారు విమర్శిస్తున్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సమరంలో కదనోత్సాహంతో రంగంలోకి దిగి శ్రేణులను సమాయత్తం చేయాల్సింది పోయి హైదరాబాద్‌లో పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి నానా హంగామా చేస్తున్నారని దుయ్యపడుతున్నారు. నియోజకవర్గాల్లో కేడర్‌ను రక్షించుకోవాల్సింది పోయి ఇప్పటి నుంచే అధిష్టానంను ఒప్పించి, టిక్కెట్‌ హామీ పొందడం కోసం తాపత్రయపడడాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇటువంటి ఊసరవెల్లులను మళ్లి దగ్గరకు చేరనిస్తే అహోరాత్రులు పార్టీని అంటిపెట్టుకుని పోరాటాలే ఊపిరిగా బరిలో నిలుస్తున్న అసలు సిసలు కార్యకర్తలకు అన్యాయం చేసినట్టేనని వారు వాపోతున్నారు…

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)


ఇంతలోనే ఎంత మార్పు! తెలంగాణ అసెంబ్లికి ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాలేదు. ఎన్నో హామీలను ఇచ్చి అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయా హామీలను నెరవేర్చడంలో విఫలమైందని భారాస ఆరోపిస్తోంది. దీనికితోడు హైడ్రా, ఆపరేషన్‌ మూసీ కార్య క్రమాలతో విపక్షాల ఆందోళనలకు ము ఖ్యంగా భారాసకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఊపు తెచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తు న్నారు. ఈ నేపథ్యంలో, గత ఎన్నికల్లో పరాజయంపాలై ఇంటికే పరిమితమైన కొందరు భారాస నేతలు మళ్లిd తెరపైకి వచ్చి హడావుడి చేస్తున్నారని శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్లు పదవులు అను భవించి, కేడర్‌ను ఏమాత్రం పట్టించు కోకుం డా, పార్టీని పట్టించు కోకుండా స్వార్థ రాజకీయాలు చేసిన ఆయా మాజీ భారాస ప్రజాప్రతి నిధులు మళ్లి రాజధానిలో మేము న్నామ ంటూ హడావుడి చేస్తుండ డంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందన్నది అలా ఉంచితే, భారాసకు చెందిన అగ్రనాయకులు కేటీఆర్‌, హరీష్‌ రావులు మళ్లిd పార్టీని క్రియాశీలకంగా మార్చడంలో కృతకృత్యులయ్యారని రాజకీయ విశ్లేషణలు సాగుతు న్నాయి. ఇదే సమయంలో హైడ్రాపై వచ్చిన ఆరోప ణలు, ఆపరేషన్‌ మూసీ దెబ్బతో ఒకింత అసంతృప్తి వ్యక్తమవు తుండడం వాస్తవ మేనన్నది వారి వాదన. అవకాశాలను అందిపుచ్చుకున్న భారాస చక్కగా ఉపయో గించుకుని తీవ్రస్థాయిలో ఆందోళనలకు ఆధ్వర్యం వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజ కవర్గాల్లో ఓటమి చెందిన బీఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నాయకత్వం, క్రియా శీల కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తూ అగ్ర నేతలిరువురికీ అండగా నిలుస్తున్నారు. అయితే, మళ్లిd ఒక్కసారిగా భారాస తెరపైకి దూసుకు రావడంతో ఓటమి చెందిన కొందరు మాజీ నేతలు తిరిగి మీడియా ముందు హడావుడి చేస్తున్నారని శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారి వ్యవహార శైలిని తీవ్రంగా నిరసిస్తున్నాయి.

జిమ్మిక్కులు మొదలు
ఎన్నో అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న ప్పటికీ, కేటీఆర్‌, హరీష్‌లు ప్రతి క్షణం జనంలో ఉంటూ వారి కష్టనష్టాలలో పాలుపంచుకుంటూ వస్తున్నారని, దీనికితోడు హామీల అమలులో కాంగ్రెస్‌ వైఫల్యంతోపాటు ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పలు పరిణామాలను అందిపు చ్చుకుని కేటీఆర్‌, హరీష్‌రావుల నేతృత్వంలో భారాస ఆందోళనలను ఉధృతం చేసింది. దీంతో మళ్లిd మాజీలు రంగంలోకి దిగారు. అదే చెక్కభజన చేస్తూ అధిష్టానం కనుసన్నల్లో పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తుండడం గమనించిన శ్రేణులు అవాక్కవుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తాం… ఫీల్డ్‌ వర్క్‌ అవసరం లేదు… హైదరాబాద్‌లో పార్టీ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నా… జనం మళ్లిd కేసీఆర్‌ వైపు చూస్తున్నారు… ఆయన పాలనను గుర్తు చేసుకుంటున్నారు… బీఫామ్‌ ఇస్తే చాలు, జనం ఓటెత్తి గెలిపిస్తారంటూ తెగ సంబరపడిపోతున్నారని కార్యకర్తలు విమ ర్శిస్తున్నారు. పైగా, రాజధానిలో అధినేతల దృష్టిలో పడితే చాలు, టిక్కెట్‌ పట్టేసి అధికారంలోకి వచ్చేస్తామని బిల్డప్‌లిస్తూ నానా హంగామా చేస్తుండడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లూ నియోజకవర్గ సమస్యలను పాతరేసి, కార్యకర్తలను గాలికొదిలేసి ఈ హంగామాలేం టంటూ శ్రేణులు నిలదీస్తున్నాయి.

ఇక ఎన్నికలు వచ్చేసినట్టేనని, తాము గెలిచిపోవడం ఖాయమని చెబుతూ ఇక బీఫామ్‌లను అధిష్టానం ఇవ్వడమే తరువాయన్నట్ట్టు వ్యవహరిస్తున్నారని, ఇది దారుణమని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్‌ సంక్షేమాభివృద్ధి ప్రభుత్వాన్ని ఇటువంటి చేష్టలతోనే మట్టిగరిపిం చారని, తిరిగి అదే పద్ధతిలో ఇప్పుడు దాపురించారని దుయ్యబ డుతున్నారు. గత పదేళ్లలో ఎన్నో పదవులను హాయిగా అనుభవించి పార్టీ ఓటమి చెందగానే హైదరాబాద్‌ భవనాల్లో సేదదీరుతూ మళ్లి సమయం అనుకూలించగానే రంగంపైకి వస్తున్న ఇటువంటి నేతలను దూరంగా పెట్టాలని, జనహితం కోసం విపక్షంలోను, కష్ట కాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని అధిష్టానానికి అండదండలు అందిస్తున్న క్రియాశీల నాయకులను పట్టించుకోవాలని కేడర్‌ అగ్రనాయకత్వాన్ని కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement