Tuesday, November 19, 2024

Exclusive ….Big Fight – కెసిఆర్ పై ఇక్క‌డ రేవంత్ రెడ్డి… అక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ ఢీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పోటీ- చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్‌, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి బరిలో దిగనున్నారు. కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని పోటీకి పెట్టాలని తొలుత భావించినా ఆయన ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ పెద్దలకు సంకేతా లిచ్చినట్టు- ప్రచారం జరిగింది. ఎల్లారెడ్డి టికెట్‌ రేసులో ఉన్న మదన్‌మోహన్‌ రావును కామారెడ్డి నుంచి భారాస అభ్యర్థి కేసీఆర్‌కు ప్రత్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రతిపాదించింది. తాజా పరిణామాల నేపథ్యంలో కామారెడ్డి నుంచి రేవంత్‌ పోటీ-కి దిగాలని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదేశించినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారమందింది.

ఇప్ప టికే రేవంత్‌కు కొడంగల్‌ టికెట్‌ను ఖరారు చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రేవంత్‌ ఇటు- కొడంగల్‌, అటు కామారెడ్డి రెండు స్థానాల్లో పోటీ-కి దిగు తున్నారు. కాగా ఎల్లారెడ్డి నుంచి పోటీ-కి సిద్ధమైన షబ్బీర్‌ అలీని నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ- చేయాలని కూడా రాహుల్‌ గాంధీ కోరినట్టు సమాచారం. ఈ నియోజక వర్గంలో లక్ష మందికి పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు
చెబుతున్నారు. ఈ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, పీసీసీ మాజీ చీఫ్‌ ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు సంజయ్‌ కన్నేశారు. భారాసను వీడి సోమవారం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత కూడా నిజామాబాద్‌ అర్బన్‌లో పోటీ- చేసేందుకు సిద్ధమైనట్టు- సమాచారం. భాజపా నేత ఈటల రాజేందర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌ అసెంబ్లీతో పాటు- సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి పోటీ-కి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మలుపులు తిరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement