తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలవుతోంది. వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ క్రమంలో ఎస్ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఎంపిక కోసం ఆసక్తి ఉన్న యువతకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ లు వారధి.. సొసైటీ ద్వారా నిర్వహించనున్న ఉచిత శిక్షణ పక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మంగళవారం కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శారీరక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 6500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అభ్యర్థులకు బుధవారం స్క్రీనింగ్ (రాత) పరీక్ష కోసం విద్యార్థులు తరలి వచ్చారు. రాత పరీక్ష కూడా పరేడ్ గ్రౌండ్ ఆవరణలోనే నిర్వహించారు ఇందుకు పరత్యేక షామియణలు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement