Tuesday, November 26, 2024

MDK: కరోనా ప్రభలకుండ పాలద్రోలాలి…మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిదంగా పారుపల్లి వీధిలో గల పాత వెంకటేశ్వర స్వామి ఆలయం లో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతుందని, ఈ పర్వదినంనా ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత అని అన్నారు. స్వామి దయతో రాష్ట్ర ప్రజలు అందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేశం, రాష్ట్రం లో కరోనా లాంటి మహమ్మారి లు ప్రభలకుండా చూడాలని ప్రార్థించారు.. ప్రజలందరూ ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హరీష్ రావుకి ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే మెదక్ పట్టణంలోని రామాలయం, వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. పల్లకి సేవ, ఆరాధన, కోలాటం వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దంప‌తులు, మాజీ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీతారామ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిరిని రామాలయ కమిటీ సాదరంగా ఆహ్వానించింది. ఎమ్మెల్సీ దంపతులను కమిటీ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు, తీర్థ ప్రసాదాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement