హైదరాబాద్ – మాజీ మేయర్. బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండ కార్తీక చంద్రారెడ్డి ని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పిలువు తో బాటసింగారంలో నిలిచిపోయాయిన డబుల్ బెదరూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న క్రమంలో అనుమతి లేదని..శాంతి భద్రతల కు విఘాతం కలుగుతుందని చెప్తూ పోలీసులు కార్తీక రెడ్డిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా కార్తీక రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ నేతల అక్రమ అరెస్టులు అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. పేద ప్రజలకు అందాల్సిన పక్కా ఇళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకోవడాని వెతుంటే బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతున్న బిఆర్ఎస్ పాలన అప్రజాస్వామిక. అరాచక.. నియంతృత్వ పోకడకు నిదర్శనాలు అని దుయ్యబట్టారు. అరెస్టు అయిన వారిలో బండ చంద్రారెడ్డి వీరన్న గండికోట నరసింహ సంపత్ శ్రీధర్ కృష్ణ శివారెడ్డి తదితరులు