రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే బీఎస్పీలో చేరనున్న ప్రవీణ్ కుమార్ ఇప్పటి నుంచే ప్రత్యర్థి పార్టీలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ సభలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. దళితులకు రాజ్యాధికారం కావాలని సభలో ప్రసంగాలు చేస్తూ అందరినీ ఏకం చేస్తున్నారు. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి నటించిన ఎర్రసైన్యం సినిమాలోని పాటను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాడారు. ఈ ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లే మనదిరా.. ప్రతి పనికి మనం రా అంటూ.. పాట పాడుతూ సభికులను ఉత్సాహపరిచారు.
ఇక తాను పాల్గొనే సభలు, కార్యక్రమాలకు కరెంట్ కట్ చేయించి ఆటంకాలు కలిగిస్తున్నారని కేసీఆర్ ని ఉద్దేశించి… ఎక్కడికి వెళ్లినా ఇలాగే చేస్తున్నావ్. ఇలాంటివాటిని సహించబోం. ఇక మేమంతా కలిసి నీ కరెంట్ కట్ చేసే సమయం ఆసన్నమైంది” అంటూ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఇక తాజాగా గులాబీ తెలంగాణ.. నీలి తెలంగాణ కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇంకా సర్వీస్ ఉన్నా.. తన ఆఫీసర్‌గా ఉంటే.. ప్రజలకు నేను అనుకున్నస్థాయిలో చేరువ కాలేకపోతున్నా.. తాను అనుకున్నవిధంగా వారికి సేవ చేయలేకపోతున్నానని భావించి వీఆర్‌ఎస్ తీసుకున్నని ఆయన తెలిపారు. ఇక ఈ నెల 8వ తేదిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరనున్నారు.
ఇది కూడా చదవండి: బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్.. డేట్ ఫిక్స్