తెలంగాణలో 30 స్థానాల్లో ఈవీఎంలు కనిపించడం లేదని కేఏ పాల్ బాంబ్ పేల్చారు. సీఈఓ వికాస్ రాజ్ ఒక పెద్ద డ్రామా నడుపుతున్నారు…అవినీతి చక్రవర్తిగా సీఈఓ మారుతున్నారని ఫైర్ అయ్యారు.
సీఈఓ వికాస్ రాజ్ పై చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశామని… 30వ తేదీ రాత్రి తుంగతుర్తిలో ఈవీయంలు కనబడటం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారు…వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారు? సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో వికాస్ రాజ్ ను కొనేశారా? అని నిలదీశారు. ఈ ఎన్నికలను రద్దు చేయాలని ప్రజలు, రాజకీయ పార్టీలు గట్టిగా కోరాలన్నారు.