బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు విమర్శలు గుప్పించారు. మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి బీజేపీ నిరూపించింది అని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలే పరిమితం అయింది అని విమర్శించారు.
సుస్థిరత, సమర్థత, భద్రత, సంకల్ప్ లాంటి గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపారని.. మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని బీజేపీ మేనిఫెస్టో తేల్చిచెప్పింది అని అన్నారు. మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పినా, ఈ నాలుగు వర్గాలను కూడా బీజేపీ విస్మరించింది.
- Advertisement -