Thursday, November 21, 2024

ADB: ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలి..

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనించాలని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష పీఠం విజయవాడ హనుమాన్ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ అన్నారు. ఆయన చేపట్టిన కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయాత్ర బైంసా పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా బైంసా పట్టణవాసులు స్వామీజీకి మంగళహారతులతో స్వాగతం పలికారు. స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ… ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పటించాలని, భగవంతుడు మనిషి సంకటనలను దూరం చేస్తాడన్నారు. స్వధర్మం వదిలి పరధర్మం స్వీకరించడం పాపమని అన్నారు. రాబోయే తరాలకు హిందూ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలన్నారు. అనంతరం స్వామీజీ భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.


కోటి పారాయణ మహా సంకల్ప యజ్ఞం మహాబలి ఆంజనేయుని జన్మస్థలమైన తిరుమల అంజనాద్రి పర్వత ఆశ్రయంగా విశ్వశాంతికై లక్ష మందితో కోటి హనుమాన్ చాలీసా పారాయణ సంకల్పాన్ని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలోని ఎస్.వి యూనివర్సిటీ అవుట్ డోర్ స్టేడియంలో 21.01.2024 ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రముఖ పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. బైంసా పట్టణంలోని మార్వాడి ధర్మశాలకు విచ్చేసిన దుర్గాప్రసాద్ స్వామీజీ వారిని నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఏ ఎంసి చైర్మన్ కృష్ణ, ప్రధాన కార్య దర్శి తోట రాము, సీనియర్ నాయకులు మురళి గౌడ్, రమేష్ శెట్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement