అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని.. ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆయన మాట్లాడుతూ… కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నివీర్లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు.
సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌లు ఇచ్చేనందుకు వచ్చిందన్నారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌పై రాజకీయం చేయొద్దన్నారు.