కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్వేచ్ఛ ఉంది.. లీడర్లు అయినా, కార్యకర్తలైనా ఒకటే.. ఇదే విషయాన్ని పార్టీ అధినేత రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకున్నాం.. అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి. ఓ మీడియా చానల్తో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్లో సీనియర్లు, జూనియర్లు అని ఏం లేదు అందరూ కలిసి పనిచేయాలని అనుకున్నాం. బలంగా పార్టీ ఉన్న దగ్గర ఫోకస్ పెట్టేబదులు.. వీక్గా ఉన్న దగ్గర దృష్టి పెట్టాలని చెబుతున్నా అన్నారు. కాంగ్రెస్ పార్టీలే నేను అంటే నడ్వదు, మనము, మేము అంటేనే ఇక్కడ నడుస్తది. అందుకే రేవంత్ మీటింగ్కు పోవట్లేదని స్పష్టం చేశారు వెంకట్రెడ్డి.
రేవంత్రెడ్డి నల్గొండ జిల్లాకు వస్తానంటే తామేందుకు వద్దంటాం అన్నారు వెంకట్రెడ్డి. ఇక్కడ పార్టీ గ్రౌండ్ లెవల్ నుంచి స్ట్రాంగ్గా ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎమ్మెల్యే, ఎంపీ దాకా పార్టీ బలంగా ఉంది. ఇక్కడ పార్టీ మీటింగ్ పెట్టి సన్నాహక సమావేశం జరిపేదానికంటే.. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేయడం మంచిదన్నారు.
తనకు పీసీసీ ఇవ్వకున్నా, స్టార్ క్యాంపెయినర్ ఇచ్చినా అంతటా తిరిగి పార్టీ ని బలోపేతం చేయడానికి ట్రై చేస్తున్నా అన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ఎండాకాలంలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేయాలంటే చాలామందిని తరలించాల్సి ఉంటుందని, దూర ప్రాంతాల నుంచి తక్కువ మందిని, దగ్గర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని తీసుకొస్తే సభ సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..