Friday, November 22, 2024

ప్రతి పల్లె అభివృద్ధిలో ఆదర్శం కావాలి- ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

బిక్కనూరు ప్రభా న్యూస్- ప్రతి పల్లె అభివృద్ధిలో ఆదర్శం కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి గ్రామంలో 87 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇటీవల ప్రతి గ్రామ పంచాయతీకి పదిలక్షల రూపాయలు సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు. 75 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు కేవలం ఎనిమిది సంవత్సరాలలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని తెలిపారు.

రామేశ్వర్ పల్లి రాజకీయాలకు పుట్టినిల్లుగా మారిందని ..అంతేకాకుండా గ్రామాభివృద్ధిలో ఐక్యతకు మారుపేరుగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేప‌డుతున్నామ‌న్నారు. రాష్ట్రంలో ఉన్న పేదలను గుర్తించి అర్హులైన వారికి కొత్తగా 10 లక్షల పింఛన్లు మంజూరు చేశామ‌న్నారు. దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ ..ఎంపీపీ గాల్ రెడ్డి ..జడ్పీటీసీ పద్మ నాగభూషణం గౌడ్ ..మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్.. రామేశ్వర్ పల్లి గ్రామ సర్పంచ్ పోతిరెడ్డి.. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నర్సారెడ్డి ..మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు హనుమంత రెడ్డి సొసైటీ అధ్యక్షులు భూమి రెడ్డి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నర్సారెడ్డి మండల తెరాస అధ్యక్షులు నర్సింహారెడ్డి ఎంపీటీసీ సభ్యులు తెరాస నాయకులు ..కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement