తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షపాతంపై ముఖ్యమంత్రివి అబద్ధాలని చెప్పారు. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైందని తెలిపారు. నీటి సమస్యలు తీర్చే సామర్ధ్యం లేక లోటు వర్షపాతమంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
పంటలు ఎండుతున్నాయి ….
ఇప్పటికే అనేక ప్రాంతాలో నీళ్లు లేక రైతులు ఆగం అవుతున్నారని వెల్లడించారు.. చేతికొచ్చిన పంట ఎండుతుంటే రైతు కంట కన్నీరు కారుతున్నదని చెప్పారు.. ఇప్పటికైనా కళ్లు తెరిచి రిజర్వాయర్లలో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించి రైతులను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇది చేతకాని ప్రభుత్వమే…
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరమైన మాట్లాడటం పట్ల తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారంపై రేవంత్ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని విమర్శించారు.