బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దొరాహంకారం ఇంకా పోలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి సీతక్కతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లో కేటీఆర్ తమ ఎమ్మెల్యే లపై అసహనంతో మాట్లాడారని అన్నారు.
బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే చులకన అంటూ మండిపడ్డారు. మీ దొరలే ఎమ్మెల్యేలుగా ఉండాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భరతం పడుతాను అంటే అర్థం ఎంటి..? అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ దళిత, బీసీల వ్యతిరేకి అంటూ నిప్పులు చెరిగారు. కేటీఆర్ కు దోరాహంకారం ఇంకా పోలేదని అన్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మాట్లాడిన మాటలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు.
కేటిఆర్ క్షమాపణ చెప్పాల్సిందే …
బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే కేటీఆర్ కు గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చారించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. పులి వస్తుందని కేటీఆర్ అంటున్నాడని గుర్తు చేశారు. పులి జనాల్లోకి వస్తే ఖచ్చితంగా బోన్ లో వేస్తాం అని ఇదివరకే మా సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్ల ద్వారా రైతులకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. త్వరలో గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామన్నారు.