Friday, November 22, 2024

ఇక్కడున్నా… నా మనసంతా మహబూబా బాద్ లోనే.. ఎంపీ కవిత

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్నాను. కానీ, ఇక్కడున్నా నా మనసంతా మన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉందని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు చెందిన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూడాలని దేశ రాజధాని నుండి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి… ప్రజలకు అవసరమైతే తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని వర్షప్రభావిత పరిస్థితులపై అధికారులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు పోన్ లో మాట్లాడుతున్నానన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు వెంకటాపురం ప్రాంత ప్రజలతో పాటు, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, నర్సంపేట, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో వర్షప్రభావిత ప్రాంతాల ప్రజలు దైర్యంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. అధికారుల సూచనలను ప్రజలు పాటించాలన్నారు. మీ.. రక్షణ ప్రభుత్వ బాధ్యత.. ఎలాంటి అసౌకర్యం కలిగినా తక్షణమే సమాచారం ఇవ్వండని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు కష్టంలో ఉన్న మీ.. ప్రాంత ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పరిస్థితి అదుపులోకి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని, ప్రజలెవ్వరూ అదైర్య పడకండన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement