Sunday, November 17, 2024

TG: అమెరికా వెళ్తున్నా… వచ్చేలోగా ఆ పనైపోవాలి…

నల్లగొండ, ఆగస్టు 3 (ప్రభ న్యూస్) ప్రతినిధి : నేను అమెరికా వెళుతున్నాను.. 11వ తేదీ తిరిగి వస్తాను.. ఆలోగా నల్లగొండ పట్టణంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేలమట్టం చేయాలని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

శనివారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమావేశ మందిరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ నుండి అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలని గతంలో ఎన్నో సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం బాగాలేదని ఆయన సున్నితంగా కమిషనర్ ను మందలించారు. తాను అమెరికా నుండి వచ్చే లోగా కార్యాలయాన్ని కూల్చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement