మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయబోరని.. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో బలమున్న వారు చేసే పనులు ఇవి కావని… బలహీనులు కాబట్టే వాళ్లు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలని సూచించారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేస్తానని చెప్పారు. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమ కాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసానని ఈటల గుర్తు చేశారు. తెలంగాణలో ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నారని మండిపడ్డారు. 0.5శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఈటల తెలిపారు.
చిల్లర రాజకీయలు చేయోద్దు: టీఆర్ఎస్ సర్కార్ పై ఈటల ఆగ్రహం
By mahesh kumar
- Tags
- cm kcr
- etela rajender
- former Minister Eatala Rajender
- Huzurabad by election
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- telangana politics
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- trs government
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement