తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకి సవాల్ విసిరారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దమ్ముంటే తనతో పోటీకి దిగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు సవాలు విసిరారు. అదే వారు కనుక ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. బెదిరింపులు, అహంకారం, డబ్బులతో హుజూరాబాద్‌లో పరిస్థితిని అటుదిటు మార్చడం కేసీఆర్ జేజమ్మ తరం కూడా కాదన్నారు. తాను ధర్మం కోసం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే సత్తా ఉన్నోడని ఈటల అన్నారు. ధర్మంతో పెట్టుకున్న కేసీఆర్ కు పతనం తప్పదని హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇదేనని అన్నారు. కేసీఆర్‌తో తనకు 18 సంవత్సరాల అనుబంధం ఉందని, కాబట్టే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రాజీనామా చేయమంటే ముఖం మీద కొట్టి వచ్చానని ఈటల పేర్కొన్నారు. గత రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నానని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిముందు ఫలించవని అన్నారు.
ఇది కూడా చదవండి: కోహ్లీ వికెట్‌తో అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు: స్టీవ్ హార్మిసన్..