Friday, November 22, 2024

నేను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుంది: ఈటల

టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలతో మండిపడ్డారు మాజీ మంత్రి ఈటల రాజేంధర్. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు ఈటల. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని మండిపడ్డారు. నాది రోశంగల్ల పుట్టుక.. నేను కాళ్లు మొక్కుతా బాంచన్‌ అని లేఖ రాస్తానా ? అంటూ ప్రశ్నించిన ఆయన.. దళితబంధు వద్దు అని నేను లేఖరాసినట్టు.. తప్పుడు ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ మాకు ఎలాంటి లేఖ రాలేదు అని స్పష్టం చేసింది.. అయినా, మళ్లీ ఇంకో ఫేక్ పోస్ట్ సృష్టించారని.. మీరంతా ఫేక్‌గాళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ పథకం కావాలన్నా ఇంటిమీద టీఆర్ఎస్‌ జెండా ఉండాలట… ఇది నీ జాగీరా కేసీఆర్‌ అంటూ నిలదీశారు ఈటల రాజేందర్. ఇవన్నీ మా డబ్బులు.. తాగే సీసాల మీద సంవత్సరానికి 30 వేల కోట్ల డబ్బులు వస్తున్నాయి. పెన్షన్ల మీద పెట్టే ఖర్చు రూ. 9 వేల కోట్లే అన్నారు. ఇక్కడికి వస్తున్న ఆరూరి రమేష్ ని అడగండి.. ఆయన నియోజకవర్గంలో దళితబంధు ఇస్తున్నాడా..? రాత్రికి రాత్రి రోడ్లు పోస్తున్నారా? అని ప్రజలకు సూచించారు. ఇక, నీ బొమ్మ పెట్టుకుంది నిజమే అయితే.. నీ కూతురు కవిత ఎందుకు ఓడి పోయింది? అని ప్రశ్నించారు. నా రాజీనామాతో ఇన్ని వచ్చాయి.. ఇంకా చాలా వస్తాయని కామెంట్ చేసిన ఈటల.. నేను గెలిస్తే తెలంగాణ రాజకీయ చరిత్ర మారుతుందన్నారు.. ఇందిరా, ఎన్టీఆర్ లాంటివారే ఓడిపోయారు.. ఎవరు శాశ్వతం కాదు.. అంటూ కేసీఆర్‌ను మెచ్చరించిన ఆయన.. మీకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి.. కానీ, ప్రమాణాలు చేయకండి అని సూచించిన ఈటల.. మోకాళ్ల మీద, మోచేతుల మీద నడిచినా మీకు ఓట్లు వెయ్యరు అంటూ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: సీఎం కు లేఖ రాసిన నారా లోకేష్..

Advertisement

తాజా వార్తలు

Advertisement