కార్పొరేషన్, (ప్రభ న్యూస్) : గ్రేటర్ వరంగల్ లో వి హబ్ ఏర్పాటుకు అన్ని విధాల సహకారం అందిస్తామని గ్రేటర్ కమీషనర్ పి.ప్రావీణ్య అన్నారు. మహా నగరపాలక సంస్థ కమీషనర్ ప్రావీణ్యను వి-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సి.ఈ.ఓ) దీప్తి రావుల ఈరోజు ప్రధాన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్ లో స్వయం సహాయక మహిళా బృంద సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా బల్దియా-వి-హబ్ సంయుక్తంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో నగరంలో వి-హబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలని సీఈఓ కమీషనర్ ను కోరారు. బల్దియా తరపున వి హబ్ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందిస్తామని కమీషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వి-హబ్ ఉపాధ్యాక్షురాలు శకుంతల, స్పాన్సర్ షిప్ మేనేజర్ రమ్య, సిటి ప్లానర్ బానోతు వెంకన్న నాయక్, డీసీపీ ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital