Thursday, November 21, 2024

Eruvaka – అర‌క‌ప‌ట్టి పొలం దున్ని, నాట్లు వేసి, ఎరువు చ‌ల్లిన మంత్రి శ్రీనివాస గౌడ్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ .. అమాత్యులు పోలంలోకి దిగారు.. అర‌క ప‌ట్టి పోలం దున్నారు.. ఫ్యాంట్ మ‌డిచి నాట్లు పోశారు.. ఆపై ఎరువులు కూడా చ‌ల్లారు.. ఇంత‌కీ ఎవ‌రా మంత్రి… వివ‌రాల‌లోకి వెళితే హన్వాడ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న క్రమంలో హన్వాడ మండలం చిన్నదర్పల్లికి చెందిన బాలకిషన్ రావు అనే రైతు పొలంలో వరి నాట్లు వేస్తుండగా… పొలంలో దిగిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గొర్రుతో కరిగెట చేశారు. అనంతరం ఎరువు చల్లారు. రైతులతో కలిసి నాట్లు వేశారు.

అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఉచితంగా నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మూడు గంటల కరెంటు చాలని అన్నదాతను ఆగం చేసేందుకు కుట్ర చేస్తోందని అక్కడున్న రైతులతో మంత్రి పేర్కొన్నారు. ఇక స్వయంగా మంత్రి పొలంలో దిగి నాటు వేయడంతో రైతులు, రైతు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని వారు పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement