తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును బుధవారం ఆయన స్వగ్రామం చింతమడకకు చెందిన గ్రామస్తులు కలిశారు. బుధవారం దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వచ్చారు..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును బుధవారం ఆయన స్వగ్రామం చింతమడకకు చెందిన గ్రామస్తులు కలిశారు. బుధవారం దాదాపు 500 మంది గ్రామస్తులు 9 బస్సుల్లో ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వచ్చారు. అయితే భద్రతా కారణాల రీత్యా పోలీసులు వారిని చెక్‌పోస్ట్ వద్దే ఆపేశారు. లోపలి నుంచి అనుమతి వస్తేనే పంపుతామని చెప్పడంతో దాదాపు 2 గంటల పాటు వేచే వున్నారు.
అనంతరం లోపలి నుంచి ఆదేశాలు అందడంతో వారిని అనుమతించారు. తర్వాత ఫాంహౌస్‌లో కేసీఆర్ ప్రజలకు అభివాదం చేసి పలకరించారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఆయనను చూడగానే కేసీఆర్ జిందాబాద్.. సీఎం , సీఎం అంటూ నినాదాలు చేశారు. కొంతమంది భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
తెలంగాణను సాధించిన జాతిపిత, దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత కేసీఆర్ గారిని చూసేందుకు అభిమానులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలుతున్నారు.
— BRS Party (@BRSparty) December 6, 2023
తమ అభిమాన నేతను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
బుధవారం… pic.twitter.com/8jY4eBEY2D