దళిత ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే దళిత బంధు అని మంత్ర ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళిత వాడల అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే దళత బంధు పథకాన్న అమలు చేస్తున్నామని తెలిపారు. రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జంయతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళితుల వాడు మాత్రమే కాదు, ఆయన అందరి వాడని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కెసిఆర్ లక్ష్యం అని తెలిపారు. అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. మన దేశ మొట్ట మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అంబేద్కర్.. మహర్ కులానికి చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. చిన్న నాటి నుండే కుల వివక్షను, అంటరాని తనాన్ని ఎదుర్కొన్నాడని తెలిపారు. చదువులో ప్రతిభావంతుడైన అంబేద్కర్, అప్పడి బరోడా మహారాజు సహకారంతో విదేశాల్లో చదువుకున్నాడన్నారు.
ఎకానమిక్స్ లో డాక్టరేట్ తీసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ వివక్షకు గురయ్యాడని తెలిపారు. 1927లో మహారాష్ట్రలోని మహద్ లో దళిత సభ పెట్టి, చెరువులో నీటిని వేలాది మంది అంటరాని మహర్లతో నీటిని తీసుకునే విధంగా చేశారని పేర్కొన్నారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కరే అని తెలిపారు. అంబేద్కర్ మొదటి న్యాయ మంత్రి అయ్యాక… దళితులకు రిజర్వేషన్లను కల్పించింది కూడా అంబేద్కరేనని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగమన్న మంత్రి ఎర్రబెల్లి.. నేటి ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నమంటే అంబేద్కర్ పుణ్యమనేనని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ఏర్పాటు చేసిందన్నారు. దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువుకునే వాళ్ళ కోసం ఒక్కొక్కరికి 20 లక్షల సహాయం చేస్తున్నట్లు చెప్పారు.