ఈఆర్సీ కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈరోజు గవర్నర్ విద్యుత్ నియంత్రణ భవన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణానికి హాని జరగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరముందని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతో ఈఆర్సీ భవన నిర్మాణం చేపడుతున్నారన్నారు. సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ ఎపిసెన్సీ, పర్యావరణ రహిత భవనం వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 2022 వరకు ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు, సీఎండీ ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital