Tuesday, November 26, 2024

టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపిస్తా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి శుక్రవారం(జులై 30) సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదని ఆయన తెలిపారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై తీవ్ర అసంతృప్తి ఉన్న పెద్దిరెడ్డి… తన అనుచరుల సలహా మేరకు టీఆర్ఎస్ లో చేరారని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ ఉనికి కోల్పోవడంతో ఆయన జీజేపీలో చేరారు. ఈటల రాజీనామా నేపథ్యంలో హుజురాబాద్ లో పోటీ చేయాలని భావించారు. అయితే ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గడంతో  రెండురోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement