Monday, October 21, 2024

TS Eamcet Results: ఇవాళ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ-2024 ఫ‌లితాలు

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 2024 ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు http://eapcet.tsche.ac.inలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది మే 7, 8 తేదీల్లో జరిగిన TS EAPCET పరీక్షకు మొత్తం 1,00,449 మంది అభ్యర్థులు హాజరు కాగా, మే 9 నుంచి 11 వరకు జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -

అయితే.. ఈ TS EAMCET 2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ ఇప్పటికే విడుదలైంది. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తయింది. వీటి ఆధారంగా ఫైనల్ ఆన్సర్ కీని రూపొందించి ఫలితాలు విడుదల చేస్తారు.అయితే.. ఈ ఏడాది TS EAMCET 2024 పరీక్షకు 3.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు TS EAMCET 2024 ఫలితాల వివరాలను https://eapcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో EAPSET పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం (మే-16) నిర్వహించిన బైపీసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షకు 90.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 39,886 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు మే 18 నుంచి 23 వరకు తొమ్మిది దశల్లో నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement