హైదరాబాదులో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ముగిసింది. వెలుతురు తగ్గిపోవడంతో రెండో రోజు రేసింగ్ పోటీలను కాస్త ముందుగానే ఆపేసినట్టు తెలుస్తోంది. కేవలం ఫార్ములా-4 రేస్ తోనే సరిపెట్టారు. ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం క్వాలిఫైయింగ్ రేసులో రెండు కార్లు ఢీకొనడం, ఓ మహిళా రేసర్ గాయపడిన ఘటనతో రేసు ఆలస్యమైంది.
దీంతో నిర్ణీత సమయం లోపు రేసు పూర్తి కాకపోగా, హైదరాబాదులో సన్‌లైట్ (వెలుగు) మందగించడంతో ఐఆర్ఎల్ నిర్వాహకులు రేసును నిలిపివేశారు. ఇక్కడి రేసింగ్ ట్రాక్ లో పోటీలు నిర్వహించేందుకు రెండు రోజులే అనుమతి ఉండడంతో రేపు (నవంబరు 21) రేసు కొనసాగించేందుకు వీల్లేకుండా పోయింది. హైదరాబాదులో నిన్నటి నుంచి ఐఆర్ఎల్ పోటీలు జరుగుతున్నాయి.