కరీంనగర్లో కలకలం సృష్టించిన ఈడి సోదాలు ముగిసాయి. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈడి, ఐటి సోదాలు రాత్రి 8:30 గంటలకు కంప్లీట్ అయ్యాయి. గ్రానైట్ వ్యాపారుల కార్యాలయాలతో పాటు వారి ఇండ్లల్లో 10 గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లల్లో కూడాఈ తనిఖీలు నిర్వహించారు.
కాగా, ఈ అంశంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన తిరిగి తెలంగాణకు వచ్చారు. అయితే.. తాను వీడియో కాల్లో ఉండి, ఇంట్లోని అన్ని లాక్లను ఓపెన్ చేయించినట్టు గంగుల తెలిపారు. అయినా.. ఇది తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని, దీనికి ఈడీకి ఏం సంబంధమో తెలియడం లేదని మంత్ర గంగుల వ్యాఖ్యానించారు.