Friday, November 22, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్​: కబ్జాకు గురైన రూ2 కోట్ల విలువైన భూమి.. రెవెన్యూ శాఖ స్వాధీనం

కొత్తగూడెం (ప్ర‌భ న్యూస్‌) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పురపాలక సంఘం పరిధిలో కబ్జాకు గురైనా రూ.2 కోట్ల విలువైన భూమిని రెవెన్యూ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి కబ్జా వ్యవహారంపై ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో సంచలనత్మక కథనాలు ప్రచురితం అయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలతను ఆదేశించారు.

కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కబ్జాకు గురైన భూమి ప్రదేశానికి ఆర్డీవో స్వర్ణలత ఆధ్వర్యంలో సింగరేణి ఎస్టేట్, పురపాలక అధికారులు వెళ్లి విచారణ జరిపారు. ఈ ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. కబ్జా స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడలు తొలగించాలని రెవెన్యూ, పురపాలక అధికారులకు సూచించారు. భూమిలో ఉన్న చెట్లను తొలగించి భూమిని చదును చేసి మొక్కలు నాటించాలని సింగరేణి ఎస్టేట్ అధికారులకు చెప్పారు. ఆంధ్రప్రభ కథనాలతో రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమార్కుల చెరనుంచి బయటపడింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో స్థానికులతో పాటు అధికారులు కూడా ఆంధ్రప్రభని అభినందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement