Friday, November 22, 2024

Encounter – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్ – ఆరుగురు మావోయిస్టులు మృతి

మన్యంలో మోగిన తుపాకీ తూటాలు
కరకగూడెం మండలంలో ఘటన
ఆరుగురు మావోయిస్టు లు మృతి
ఇద్దరూ పోలీసులకు తీవ్రగాయాలు
కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లచ్చన్న మృతి చెందినట్లు సమాచారం..?


పినపాక/కరకగూడెం,సెప్టెంబరు 5,(ప్రభ న్యూస్): మన్యంలో మరోసారి తుపాకీల తూటాలు మోగాయి.కోన్ని సంవత్సరాలు తర్వాత కాల్పులు చోటు చేసుకోవడంతో మన్యం వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. మావోయిస్టు లకు,పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, కరకగూడెం మండలంలోని,రఘునాథ పాలెం అటవీ ప్రాంతంలోని తిరుమల దోనెల గుట్ట ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకగూడెం మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టు లు సంచరిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు,గ్రే హౌండ్స్ పోలీసులు అడవులను విస్తృతంగా జల్లెడు పడుతున్నారు.

- Advertisement -

ఈ కోణంలోని రఘనాధపాలెం అటవీ ప్రాంతంలో తిరుమల దోనెల అటవీ ప్రాంతంలో ,మావోయిస్టు తారస పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టు లకు భీకరంగా ఎదురుకాల్పులు దాదపు పావుగంట సేపు జరిగాయి. కొద్దిసేపటి కి కాల్పులు మావోయిస్టు ల నుండి ఆగిపోవడంతో, పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు లు మృతి చెందడంతో పాటు, ఇద్దరు పోలీసులకు గాయలైనట్లు పోలీసులు వివరాలు వెల్లడించారు. గాయాలైన పోలీసులను భద్రాచలం ఏరియా అసుపత్రికి వైద్యం కోసం 108 ద్వారా తరలించారు. ఈ ఎదురు ఎన్ కౌంటర్ లో మణుగూరు ఏరియా కమిటి లచ్చన్న దళంగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత లచ్చన్న మృతి చెందినట్లు సమాచారం. ఘటన ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎంత మంది మావోయిస్టు లు ఈ కాల్పుల్లో పాల్గొన్ని ఉంటారని,వారి కోసం అన్వేషణ చేపట్టారు. ఈ కాల్పుల్లో జరగడంతో పినపాక,కరకగూడెం మండలంలో పోలీసులు అణువు, అణువున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులు పై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement