Sunday, November 17, 2024

Encounter – స‌బ‌ర్మ‌తి ప్ర‌క్షాళ‌నపై మోదీని ఎందుకు ప్ర‌శ్నించ‌లా..కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్లాస్

అక్క‌డ 15 వేల కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి
మూసి కోసం తాము భారీ ప్యాకేజ్ తో ముందుకువెళ్లుతున్నాం
అక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి న్యాయం చేస్తాం
మీరు న‌దులు ప్ర‌క్షాళ‌న చేస్తే ఒప్పు..అదే మేం చేస్తే త‌ప్పా
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి క్లాస్ పీకిన రేవంత్ రెడ్డి
మ‌హారాష్ట్ర ను దోచుకునేందుకు ఇద్దరు గుజ‌రాతీలు రెడీ
ఎన్ నాథ్ షిండేని పావులా వినియోగించుకుంటున్న‌ బిజెపి

ముంబ‌యి – గుజ‌రాత్ లో సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ని కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించ లేదని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని నిల‌దీశారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ఆనాడు సబర్మతి ప్రక్షాళన కోసం ఏకంగా 15 వేల కుటుంబాలను మరోచోటికి తరలించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతల బస్తీ నిద్రపై మ‌హారాష్ర్ట‌లో ఉన్న రేవంత్ అక్క‌డి మీడియాతో నేడు మాట్లాడుతూ, గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమని బీజేపీ నేతలు చెబుతున్నారని.. మూసీ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం రాష్ట్రంలో కమలనాథులు అడ్డుపడుతున్నారని అన్నారు.. మీరు ఏం చేసిన అది ఒప్పు, అదే ప‌ని మేం చేస్తే త‌ప్పా అంటూ తెలంగాణ బిజెపి నేత‌ల‌పై ఆయ‌న రుసురుస‌లాడారు. మూసీ నది బాగుచేయడం బీజేపీ నేతలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయినట్లేనా అని చుర‌క‌లంటించారు.

మ‌హారాష్ట్ర ను దోచుకునేంద‌కు ఇద్ద‌రు గుజ‌రాతీలు రెడీ
మహారాష్ట్ర ను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు వచ్చారని.. ధారావి ప్రాజెక్ట్ ను అడ్డు పెట్టుకుని పెద్ద మొత్తంలో లూఠీ చేసేందుకు స్కెచ్ వేశారని ధ్వజమెత్తారు రేవంత్. మహారాష్ట్ర కు రావాల్సిన 17 కంపెనీలను ప్రధాని మోడీ మోసపూరితంగా గుజరాత్ కు తరలించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఇక వారికి అవకాశం ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ ఏక్‌నాథ్ షిండేను పావుగా వాడుకుందని ఫైర్ అయ్యారు. వాస్త‌వాలు తెలుసుకున్న మ‌రాఠ ప్ర‌జ‌లు బిజెపి కూట‌మిని ఓడించేందుకు సిద్దంగా ఉన్నార‌ని రేవంత్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement