Friday, November 8, 2024

Encounter – ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి మాస్ కౌంటర్

ట్విట్టర్​లో రిప్లయ్​ ఇచ్చిన సీఎం రేవంత్​
ఇచ్చిన హామీలను మాట త‌ప్ప‌కుండా అమలు చేస్తున్నాం
అధికారంలోకి వచ్చిన‌ రెండో రోజే రెండు హామీలను నెరవేర్చాం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా వర్తింపు
గృహలక్షి కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్​
500 రూపాయలకే గ్యాస్​ సిలెండర్​
రైతులకు రెండు లక్షల రుణమాఫీ
22 లక్షల 22 వేల మంది రుణ విముక్తులయ్యారు
తెలంగాణలో 101 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారు
4 కోట్ల మందికి గ్యాస్​ సబ్సిడీ అందించాం
పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: ఎ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ అవి అమలు చేయడంలో విఫలమైందని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్విట్టర్‌లో.. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023లో అధికారంలోకి వచ్చిందని.. అదే రోజు నుంచి పేదలకు మేలు చేకూర్చామని చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండో రోజే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హామీలను అమలు చేశామని అన్నారు. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రెండోది ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10లక్షలకు పెంచామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే మిగతా హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు..

- Advertisement -

ప్రియమైన నరేంద్రమోదీ జీ అంటూ..

ప్రియమైన నరేంద్ర మోదీ అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వం మీద మీకున్న అపోహలను తొలిగిస్తాం. డిసెంబర్ 7, 2023 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే, తెలంగాణ ప్రభుత్వం తన మొదటి, రెండో ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య సంరక్షణ.. ఆసుపత్రి కవరేజీని కల్పించాం. గత 11 నెలల్లో తెలంగాణాలోని మన సోదరీమణులు, తల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్లకు పైగా ఉచిత బస్సు యాత్రలను చేపట్టి, ఒక సంవత్సరం లోపు ₹3,433.36 కోట్లు ఆదా చేశారు. మొదటి సంవత్సరం పూర్తి కాకముందే, మేము రైతే రాజు (తెలంగాణలో రైతు రాజు)కి భరోసా ఇస్తూ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్ర స్థాయి రైతు రుణమాఫీని అమలు చేశాం. 22 లక్షల 22 వేల మంది రైతులు (22,22,365) ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా, రాజులా జీవిస్తున్నారు. ₹2,00,000 వరకు రైతుల రుణాలన్నీ మాఫీ చేశాం. 25రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.. అని సీఎం రేవంత్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

గృహాలకు ఉచిత విద్యుత్​..

పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ చార్జీ లేకుండా ఉచిత విద్యుత్ అందుతున్నందున మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎక్కువగా ఉంటే, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే సిలిండర్‌ లభిస్తుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తమ హయాంలో ఇప్పటివరకు 1.31 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్ రీఫిల్‌లు అందించామని చెప్పారు. 42,90,246 మంది లబ్ధిదారులు వంటగదిలో హ్యాపీగా ఉన్నారని రేవంత్​ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement