వరంగల్ – తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో బుధవారం జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ మాట్లాడుతూ, భూమి బద్ధలైనా అగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేస్తూ రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని రెడీ ఉండు అని హరీష్ ను కోరారు.
.రామప్ప, సమ్మక్క సాక్షిగా ఇచ్చిన మాట తప్పం అని రేవంత్ అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని.. బీఆర్ఎస్ నేతల్లా తాను తలకాయ లేని మాటలు చెప్పను అని సీఎం అన్నారు
దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని.. బీఆర్ఎస్ నేతల్లా తాను తలకాయ లేని మాటలు చెప్పను అని సీఎం అన్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని, కేసీఆర్ రాష్ట్రాన్ని ఢిల్లీలో మోదీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘మామా, అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారు. అసెంబ్లీలో మా కళ్లలో చూసే ధైర్యం లేక కేసీఆర్ పారిపోయాడు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. మాతో చర్చకు రమ్మంటే పారిపోతాడు. కేసీఆర్ చచ్చిన పాము. కాళేశ్వరం అద్భుతంగా కట్టి ఉంటే కేసీఆర్ నాతో చర్చకు రావాలి. ప్రాజెక్టు వద్దే చర్చకు రావాలి.
బీఆర్ఎస్, బీజేపీ నాణానికి బొమ్మ బొరుసు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడించాలి. బీజేపీ నేతలకు మతపిచ్చి పట్టుకుంది. మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. వరంగల్‌లో ఆరూరి రమేష్‌కు ఓటేస్తే అనకొండై మీ భూములు మింగేస్తాడు. చేయి గుర్తుకు ఓటేసి కడియం కావ్యను గెలిపించాలి’అని రేవంత్ కోరారు.