Monday, November 25, 2024

Encounter – కొండా వ్యాఖ్యాల‌పై నాగార్జున గ‌రం గ‌రం … మీరు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలే అంటూ ఎన్ కౌంట‌ర్

హైద‌రాబాద్ – సినీ జంట నాగ చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌డానికి మాజీ మంత్రి కెటిఆర్ కార‌ణ‌మంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ లో ట్విట్ చేశారు.. రాజకీయాల‌కు దూరంగా ఉంటే సినీ ప్ర‌ముఖుల జీవితాల‌ను మీ ప్ర‌త్య‌ర్ధుల‌ను విమ‌ర్శించుకోవ‌ద్దంటూ క్లాస్ పీకారు.. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అంటూ తేల్చి చెప్పారు.. ద‌యచేసి సాటి మ‌నుషుల వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను గౌర‌వించండి అంటూ కోరారు.. మీరు చేసిన వ్యాఖ్య‌ల‌న్నింటిని త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకోవల‌సిందిగా నాగార్జున మంత్రి కొండా సురేఖ‌ను కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement