Friday, December 20, 2024

Encounter – కెటిఆర్ లో నిజాయితీ లేదు… సీత‌క్క ధ్వ‌జం

హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేబినెట్ ఆమోదం తీసుకొని ఈ కార్ రేస్‌కు మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో నేడు ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు అని నిలదీశారు. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుకు సభలో చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు.

బీఏసీలో ఈ ఫార్ములా మీద చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదని అన్నారు. ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. జైలుకు వెళ్లి యోగా చేస్తానన్న కేటీఆర్ ఎందుకు బయపడుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు నిజాయితీ లేదని.. అందుకే అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను, అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారని మంత్రి సీతక్క అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement