Tuesday, November 26, 2024

Encounter – 1400 మంది మ‌ర‌ణానికి కార‌కులైనా మీరా మోడీని క్ష‌మాప‌ణ కోరేది… రాహుల్ కు బండి ప్రశ్న

హైద‌రాబాద్ – స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్‌గాంధీకి కౌంటర్ ఇచ్చారు. 1400 మంది అమరవీరుల మరణానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకు మేలు చేసే ప్రధాని మోడీని సిగ్గు లేకుండా ప్రశ్నిస్తున్నావని దుయ్యబట్టారు. తెలంగాణకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగు లాంగ్వేజ్‌లో ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ, మీ ముత్తాత నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసిందని విమర్శించారు. వందలాది మంది అమరవీరుల మరణానికి కారణమైనందుకు మీరు.. మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలి? అని ప్రశ్నించారు…

జవహర్‌లాల్ నెహ్రూ – జెంటిల్‌మన్ ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని, ఇందిరా గాంధీ – కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా 1969లో దాదాపు 369 మంది ప్రాణాలు కోల్పోయారని, 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని 1985లో రాజీవ్ గాంధీ హామీ ఇచ్చారని, సోనియా గాంధీ – 2009 తెలంగాణా ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గారని, 1400 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని తెలిసి బిల్లును ప్రవేశపెట్టారని, ఇవి వాస్తవాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement